ETV Bharat / city

'కాంగ్రెస్ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి' - నిజమాబాద్​లో కాంగ్రెస్​ ప్రెస్​మీట్

అక్టోబర్​ 9న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ భవన్​లో మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్​ గెలిస్తే జిల్లాను అభివృద్ధి చేస్తామని భూపతిరెడ్డి అన్నారు.

former mlc pressmeet at nizamabad about elections
'కాంగ్రెస్​ జెండా ఎగిరేలా ప్రజాప్రతినిధులు సహకరించాలి'
author img

By

Published : Oct 8, 2020, 1:54 PM IST

కాంగ్రెస్​ను గెలిపిస్తేనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ భవన్​లో పేర్కొన్నారు. అక్టోబర్​ 9న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడిచినా.. జిల్లా పరిషత్, మండల పరిషత్​లకు నిధులు రాలేదని.. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రణాళికల నిధులు మాత్రమే వచ్చాయని ఆయన ఆరోపించారు.

జిల్లా నుంచి తెరాసకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ నిజామాబాద్​లో అభివృద్ధి జరగట్లేదని భూపతిరెడ్డి విమర్శించారు. ప్రజల పక్షపాతి అయిన కాంగ్రెస్​ పార్టీకి స్థానిక ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలని... ఎన్నికల్లో హస్తం జెండా ఎగురవేయాలని భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:- ఐఆర్​సీటీసీలో 15-20 శాతం వాటా విక్రయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.