పసుపు పంటకు రూ.8 వేలకు పైగా ధర లభిస్తున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. పసుపు పంటకు ఈ సీజన్‌లో అత్యధికంగా రూ.6,800 రూపాయలు మాత్రమే వచ్చాయన్నారు. కొందరు కావాలనే రైతులను అయోమయం చేయాలనే ఉద్దేశంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
నిజామాబాద్‌లోని పసుపు మార్కెట్ల్‌లో ధరల పరిస్థితిని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు పరిశీలించారు. మార్కెట్‌లో డైరెక్ట్ పర్చేస్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. పసుపు పంటకు బోర్డు వస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని రైతు కమిటీ నేతలు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బోయిన్పల్లి మార్కెట్‌లో వ్యర్థాల నిర్వహణ అద్భుతం: గవర్నర్