కరోనా వ్యాప్తి నివారణకు తలపెట్టిన లాక్డౌన్ కారణంగా దుకాణాలన్నీ మూసే ఉంటున్నాయి. యాదాద్రిలో భక్తుల సంచారం కూడా లేదు. ఓ వైపు తినడానికి తిండి లేక.. ఏదో ఒకటి ఇచ్చి ఆకలి తీర్చేవారు. తినడానికి ఏమీ దొరకక.. భక్తులు పెట్టే తిండి లేక కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి బాధ గమనించిన కొంతమంది యువకులు యాదగిరి పట్టణంలోని కూరగాయలు, పండ్ల దుకాణాల్లో మిగిలినవి తీసుకొచ్చి కోతుల ఆకలి తీరుస్తున్నారు. గత వారం రోజులుగా.. ప్రతిరోజు కూరగాయలు, మిగిలిపోయిన పండ్లు సేకరించి కోతుల ఆకలి తీరుస్తూ.. మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్... రూపొందించిన డీఆర్డీవో