యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి ఏడు వరకు పదకొండు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షబంధనం పూజలు నిర్వహించారు.
బాలాలయంలో బ్రహ్మోత్సవాలు..
ప్రధానాలయా పునర్నిర్మాణం పనులు జరుగుతున్నందున.. బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రధానాలయం గర్భాలయంలో స్వయంభూ నరసింహునికి పూజలు నిర్వహించి.. స్వామి వారి అనుమతితో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు.
ఇవీ చూడండి: దిల్లీలో పాలు, కూరగాయల ధరలకు రెక్కలు