నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రైతులు స్వచ్ఛందంగా 500 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి గుండ్లపల్లి వరకు చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. రైతు బాగోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
కబ్జాదారులకు కళ్లెం వేసేలా సీఎం కేసీఆర్ రెవెన్యూ చట్టాన్ని అమలుచేశారని సునీత అన్నారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతులు తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే పత్రాలు కొనుగోలుదారుల పేరు మీదకు మారుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇలానే మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి త్వరలోనే బంగారు తెలంగాణను సాధించాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆకాంక్షించారు.
ఇదీ చదవండిః ట్రాక్టర్‌పై వెళ్లి అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్