ETV Bharat / city

నల్గొండ ఖిల్లాపై ఎగిరేది ఎవరి జెండా?

ఒకప్పటి కమ్యూనిస్టుల ఖిల్లా... తర్వాత కాంగ్రెస్ కంచుకోట... నేడు గులాబీ అడ్డాగా మారిన నల్గొండలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార పార్టీ హవా ఓ వైపు... హస్తం అధ్యక్షుడు మరో వైపు. మోదీ ఇమేజీపై ఆశతో నేనున్నానంటున్నాడు కమలం అభ్యర్థి. మరి జెండా ఎవరు ఎగరవేస్తారనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.

author img

By

Published : May 20, 2019, 5:20 AM IST

Updated : May 20, 2019, 7:48 AM IST

నల్గొండ ఖిల్లాపై గెలుపెవరిది?

నల్గొండ జిల్లా నాయకుల పేర్లు చెబితే చాలు... ఏ పార్టీ ఎంత బలంగా ఉందో అంచనా వేయవచ్చు. కొన్ని దశాబ్దాలుగా చూస్తే... ఒక్కోసారి ఒక్కో పార్టీ ఏకఛత్రాధిపత్యం సాధించాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి హవా నడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి కేడర్ బాగానే ఉన్నా... నాయకుల మధ్య సమన్వయ లేమి చిక్కులకు కారణమవుతోంది. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో... తెరాస తరఫున వేమిరెడ్డి నర్సింహారెడ్డి... కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గార్లపాటి జితేంద్ర కుమార్ బరిలో నిలిచారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డాయి. భాజపా అభ్యర్థి కూడా ఓట్లు చీల్చినట్లు తెలుస్తోంది.

పార్టీ బలమే...

నల్గొండ పార్లమెంటు పరిధిలో ఏడు స్థానాలకు గానూ... 6 గెలుచుకొని తిరుగులేని శక్తిగా తయారైంది తెరాస. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్ధేశంతో... మంత్రి, ఎమ్మెల్యేలు అభ్యర్థి గెలుపు కోసం సమష్ఠిగా కృషి చేశారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి సవాలే అయినప్పటికీ... నియోజకవర్గంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటం అనుకూలాంశం. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అండదండలున్నా... చైతన్యవంతులైన నల్గొండ ఓటర్లు అభ్యర్థులను బేరీజు వేసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ విజయం అంత సులువు కాదని తెలుస్తోంది.

అభ్యర్థి బలం...

కాంగ్రెస్​లో ముఖ్యనేతలుగా ఉన్న ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జానారెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్ జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ... వారి మధ్య సఖ్యత అంతంత మాత్రమే. ఒకరి నియోజకవర్గంలో ఒకరు కాలు పెట్టాలంటే ఆలోచిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గట్టి క్యాడర్​ ఉన్నా... నాయకుల మధ్య సమన్వయ లోపం ప్రతికూలంగా కనిపిస్తోంది. కాకపోతే పార్టీ పరువు దక్కాలంటే ఉత్తమ్ ఎంపీగా గెలిపించుకోవాలని సీనియర్లు భావించినట్లు తెలుస్తోంది. కోదాడ, హుజూర్​నగర్​లో ఉత్తమ్ దంపతులకు మంచి పట్టుంది. మిగతా నియోజకవర్గాల్లో శ్రేణుల సమన్వయంతోపాటు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, జానారెడ్డి ఏ మేరకు సహరించారనే దానిపై పార్టీ అభ్యర్థి గెలుపు ఆధారపడి ఉంది. తెరాస నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేయడం కాంగ్రెస్​కు కలిసివచ్చే అంశం.

'వర్గ' బలం..

భాజపా అభ్యర్థిగా దేవరకొండకు చెందిన వ్యాపారి గార్లపాటి జితేంద్ర కుమార్ అనూహ్యంగా బరిలో దిగారు. సరైన నాయకత్వం లేకున్నా నియోజకవర్గమంతా చుట్టివచ్చారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు లక్షకు పైగా ఉన్న ఆ ఓట్లు 80 శాతానికి పైగా తనకే పడతాయని జితేంద్రకుమార్ ధీమాగా ఉన్నారు. మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు భాజపాకే మొగ్గు చూపినట్లు అంచనా వేస్తున్నారు. గతానికి భిన్నంగా ఓట్ల శాతం పెంచుకోనున్నట్లు విశ్లేషిస్తున్నారు. ముక్కోణపు పోరు నెలకొన్న నల్గొండలో ఎవరి జెండా ఎగరనుందనేది రెండు రోజుల్లో తేటతెల్లం కానుంది.

నల్గొండ ఖిల్లాపై గెలుపెవరిది?

నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు...
నియోజకవర్గం పోలింగ్​ శాతం
కోదాడ 78.05
హూజూర్​నగర్ 77.15
నల్గొండ 74.92
మిర్యాలగూడ 73.83
సూర్యాపేట 73.67
నాగార్జునసాగర్ 72.34
దేవరకొండ 68.80

ఇవీ చూడండి: ఎగ్జిట్ పోల్స్​తో కాంగ్రెస్​లో కలవరం

sample description
Last Updated : May 20, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.