నాగార్జున సాగర్ జలాశయం (Nagarjunasagar dam) క్రస్ట్ గేట్లు మరొకసారి తెరుచుకున్నాయి. ఎగువనుంచి సాగర్ జలాశయానికి 2లక్షల 16వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ జలాశయం(Nagarjuna sagar) 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి... స్పిల్ వే ద్వారా 80,690 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయం (Nagarjunasagar dam) మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.14 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం (Nagarjunasagar dam) విద్యుత్ ఉత్పత్తి, సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఎస్ఎల్బీసీ కాల్వలకు మొత్తం లక్షా 33 వేల క్యూసెక్కుల వరద ఔట్ ఫ్లోగా వెళ్తోంది. గత నెల 1నుంచి 14 రోజుల పాటు సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేశారు. ఈ సజనddna్ మరొకసారి ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంతో క్రస్ట్ గేట్లను ఎత్తి వచ్చే వరదను బట్టి క్రస్ట్ గేట్లని ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చూడండి: Nagarjuna sagar: సాగర్ టు శ్రీశైలం లాంచీ సేవలు రద్దు.. ఎందుకంటే!