అధికారం కోసం ఎన్నో మాటలు చెప్పిన కేసీఆర్.. గద్దెనెక్కిన తర్వాత పేదల పాలిట కర్కశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. యాదాద్రి పట్టణ విస్తరణ, ఆలయ నిర్మాణం మంచిదేనని.. ప్రపంచం గర్వించదగ్గ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ వంకతో.. పేదల ఇళ్లను కూలగొట్టి ఆ స్థలాల్లో గుట్టకు రోడ్డు వేస్తా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
యాదాద్రికి రోడ్డు సౌకర్యం కోసం.. అప్పులు చేసి, లోన్లు తెచ్చి కట్టుకున్న పేదల ఇళ్లను కూలగొట్టాలనుకోవడం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనం అన్నారు. పాత యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న ప్రభుత్వ స్థలాల గుండా రింగురోడ్డు వేసుకోమని సూచించారు. యాదాద్రి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం చాలా తక్కువ అని విమర్శించారు.