మిర్యాలగూడ తెరాస ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై ఓ రైతు కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యే చేస్తున్న భూ కబ్జాలను అడ్డుకున్నందుకు... తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితురాలు మణెమ్మ కమిషన్‌కు తెలిపారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భర్త బుచ్చిబాబు, కుమారుడు, కుమార్తెను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు తన ఇంటి కాగితాలు, పాసు పుస్తకాలు, దస్తావేజులు లాక్కెళ్లారని ఆరోపించారు. భాస్కర్‌రావు నుంచి ప్రాణహాని ఉందని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఎమ్మెల్యేకు సహకరిస్తున్న పోలీసులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు హెచ్ఆర్సీని వేడుకున్నారు.
ఇవీ చూడండి: నక్సల్స్ వ్యూహం.. పోలీసుల ప్రతివ్యూహం