తెలంగాణ నుంచి ఆంధ్రాకు పయనమైన వారు నల్గొండ జిల్లా సాగర్ చెక్పోస్ట్ వద్ద నిలిచిపోయారు. ఏపీలోకి వచ్చేందుకు ఆ రాష్ట్ర పోలీసులు అనుమతివ్వకపోవడం.. అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లాలని తెలంగాణ పోలీసులు చెప్పడం వల్ల ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్లపైన, చెట్ల కింద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
హైదరాబాద్లో పోలీసుల నుంచి అనుమతి పత్రాలు తీసుకుని పయనమయ్యామని.. కానీ ఏపీ పోలీసులు స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రయాణికులు వాపోయారు.
గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయాం. తమకు ఏమైనా జరిగితే దానికి ఏ ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు: యువతుల ఆవేదన
ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన పోలీసులు సమీపంలోనే ఓ టిఫిన్ సెంటర్కు అనుమతిచ్చారు. ఇరు రాష్ట్రాల పోలీసుల వైఖరితో వందల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు వందల మంది ప్రయాణికులకు నచ్చజెప్పేందుకు పోలీసులు శ్రమపడాల్సి వస్తోంది.
ఇవీచూడండి: ఆంధ్రులే.. ఎన్ఓసీ కూడా ఉంది.. కానీ ఏపీలోకి నో ఎంట్రీ