ETV Bharat / city

Lemon Farmers losses: సిండికేట్​గా దళారులు.. నిమ్మ రైతులకు నష్టాలు

Lemon Farmers losses: నల్గొండ జిల్లాలో నిమ్మ రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. దళారులు సిండికేట్‌గా మారి పంటకు తక్కువ ధర చెల్లిస్తుండడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Lemon Farmers losses
Lemon Farmers losses
author img

By

Published : Mar 17, 2022, 11:01 AM IST

Lemon Farmers losses: సిండికేట్​గా దళారులు.. నిమ్మ రైతులకు నష్టాలు

Lemon Farmers losses : రాష్ట్రంలోనే తొలిసారిగా నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 3 కోట్ల రూపాయలతో మూడేళ్ల క్రితం నిమ్మ మార్కెట్ ఏర్పాటుచేశారు. నిమ్మకు ప్రత్యేక మార్కెట్‌ రావడంతో పంటకు మంచి మార్కెట్‌ ఉంటుందని వివిధచోట్ల నుంచి వ్యాపారులు వచ్చి పంటను మంచి ధరకు కొంటారని రైతులు ఆశించగా అది నెరవేరడం లేదు. దళారులు సిండికేట్‌గా మారి నిమ్మకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

లక్ష కూడా రావట్లే..

నిమ్మకు ఏడాదిలో కొన్ని రోజులే మంచి డిమాండ్‌ ఉంటుంది. అప్పుడే మంచి ధర వస్తుంది. మిగిలిన కాలమంతా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. డిమాండ్‌ ఉన్న సమయంలోనూ పంటకు మంచి ధర రాకపోతే తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు లక్షలు పెట్టి సాగు చేస్తే... లక్ష కూడా రావట్లేదని ఆవేదన చెందుతున్నారు. నిమ్మ బస్తా 50, 100 రూపాయలే పలుకుతోందని రైతులు చెబుతున్నారు. కనీసం 300 నుంచి 400 వస్తేనే... పెట్టిన పెట్టుబడి వస్తుందంటున్నారు. ఖరీదుదారులు, కూలీలు మాత్రమే లాభపడుతున్నారని... రైతులు మాత్రం నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.

పరిశ్రమలు వస్తేనే..

మూడేళ్ల క్రితం ఏర్పాటైన మార్కెట్‌లో సరైన వసతులు లేవు. అదనపు దుకాణ సముదాయ నిర్మాణ పనులు చేపట్టగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిర్వహణకు 13 మంది సిబ్బంది అవసరం కాగా ఇప్పటివరకు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించలేదు. అధికారులకు పగలు వ్యవసాయ మార్కెట్‌లో.. రాత్రి నిమ్మ మార్కెట్‌ విధులుండటంతో పర్యవేక్షణ కొరవడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. నిమ్మ ఆధారిత పరిశ్రమలు వస్తేనే డిమాండ్‌ పెరిగి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు అంటున్నారు.

ఇదీచూడండి: పోలీసుల దాష్టీకం.. అన్నదాతపై విరిగిన లాఠీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.