నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు, మర్రిగూడ మండలాల్లో భారీ వర్షం కురిసింది. రోజంతా ఎండ కాసి సాయంత్రం ఒక్కసారిగా ఆకాశమంతా మేఘావృతమై పెద్ద ఎత్తున వాన పడి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువలు, కుంటలు నిండి జలకళ సంతరించుకుంటున్నాయి.
జిల్లాలోని పలు చోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కొన్ని గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పంటపొలాల్లో నీరు చేరి పత్తిపంటలు దెబ్బతిన్నాయంటూ రైతులు వాపోయారు. గ్రామాల్లో పంటనష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి.. తమను ఆదుకోవాలని రైతన్నలు కోరారు.
ఇదీ చదవండిః జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు