Etela Rajender Fire on CM Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉపఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు, వారి సమస్యలు గుర్తుకొస్తాయని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మిగతా సమయంలో పంప్‌హౌస్ ప్రగతిభవన్ నుంచి బయటకు రాలేదని ఆయన ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ కాలనిలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో అక్కడ ఏవిధంగా అయితే దళితులందరికీ దళితబంధు ఇచ్చారో.. అలాగే మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక ముందే దళితులకీ దళిత బంధు, గిరిజనులందరికీ గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఎన్నికలు రాగానే అక్కడ ముందస్తుగా పోలీసులు, ఇంటెలిజెన్స్, పార్టీ నాయకులను దింపుతారని కేసీఆర్‌పై ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. నాయకులతో ధావత్లు పెట్టించి కార్యకర్తలను మభ్యపెడతారని ఆయన ఆరోపించారు. 2018 ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎంత డబ్బు పంచి.. ఎన్నిఎత్తుగడలు వేసిన మునుగుడులో ప్రజలు భాజపానే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: