తుంగతుర్తి, నూతనకల్లులో ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలను టాస్క్ఫోర్స్, వ్యవసాయ, పోలీస్ అధికారులు శుక్రవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో నిలువ ఉంచిన ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. సమగ్ర వ్యవసాయం విధానంలో భాగంగా నిబంధనల ప్రకారం విత్తనాలు, ఎరువులను విక్రయించాలని తుంగతుర్తి ఏడీఏ జగ్గు నాయక్ సూచించారు.
రసీదులు తప్పనిసరిగా అందించాలని దుకాణదారులకు సూచించారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇవీ చూడండి: పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం