మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయంలో 'స్వచ్ఛ తెలంగాణ'లో భాగంగా సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ భారతి హోళీకేరి కలిసి వాటిని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని జనాభా ప్రాతిపదికన 87 పబ్లిక్ టాయిలెట్లు అవసరమవగా.. 92 మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే దివాకర్‌రావు వెల్లడించారు.
స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులను చేయిస్తోందని కలెక్టర్ భారతి అన్నారు. రాష్ట్ర రవాణాసంస్థలో నిరుపయోగంగా ఉన్న బస్సులను మున్సిపాలిటీ కొనుగోలు చేసి మరుగుదొడ్లుగా తయారు చేయించారని తెలిపారు. ప్రజారద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ సంచార టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు హోళీకేరీ వివరించారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం