మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస అభ్యర్థి మాలోత్ కవిత దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి దంపతులు కూడా ఇదే కేంద్రంలో ఓటేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కంకర బోడులోని 227 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన ప్రముఖులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ స్వగ్రామమైన ఉగ్గంపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కురవి మండలం పెద్దతండాలో, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రునాయక్ సీరోలులో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో 136వ బూతులో ఆ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి దంపతులు, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పటేల్ ఓటు వేశారు.
మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలోని ఖాసింపేటలో 173 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వచ్చి సరి చేసిన అనంతరం ఆలస్యంగా పోలింగ్ మొదలైంది.
ఇదే జిల్లాలోని వెంకటాపురం మండలం వడగూడెం గ్రామంలో ఓటర్లు పోలింగ్ దూరంగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. తహసీల్దార్, పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఇవీ చూడండి: ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ