ETV Bharat / city

పోలేపల్లి సెజ్​లో పర్యావరణ ఉల్లంఘనులపై నజర్‌ - Environmental violation in Polepally SEZ

మహబూబ్​నగర్​ జిల్లాలోని పోలెపల్లి సెజ్‌లో నిబంధనలు ఉల్లంఘించి కాలుష్యానికి కారణమవుతున్న ఔషధ పరిశ్రమలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉదారత చూపుతోంది. వెయ్యి రోజులకు పైగా పరిశ్రమలు నిబంధనలు పాటించలేదని తన నివేదికల్లో చెబుతూనే.. కేవలం 365 రోజులకు మాత్రమే పర్యావరణ పరిహారాన్ని లెక్కించి... అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

National Green Tribunal about Polepally Sez case
పోలేపల్లి సెజ్​లో పర్యావరణ ఉల్లంఘనులపై నజర్‌
author img

By

Published : Jan 16, 2021, 7:34 AM IST

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో ఔషధ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై దిల్లీ హరిత ట్రైబ్యునల్‌లో జరుగుతున్న విచారణ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. జడ్చర్లకు చెందిన కోస్గి వెంకటయ్య సెజ్ కాలుష్యంపై 2019లో ట్రైబ్యునల్‌ని ఆశ్రయించగా విచారణ కొనసాగుతోంది. గతేడాది జనవరిలో ట్రైబ్యునల్ ఆదేశాలతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ఉల్లంఘనలపై నష్టాన్ని అంచనా వేసి పర్యావరణ పరిహారం చెల్లించాల్సిందిగా ఆయా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

పోలేపల్లి సెజ్​లో పర్యావరణ ఉల్లంఘనులపై నజర్‌

8 పరిశ్రమలకు ఆదేశాలు

పోలెపల్లిలోని 8 పరిశ్రమలకు 365 రోజుల ఉల్లంఘనలకు గాను ఒక్కో పరిశ్రమ18లక్షల 25వేలు, మరో పరిశ్రమకు ఆర్నెళ్ల ఉల్లంఘనలకు గాను 9లక్షలు పరిహారాన్ని చెల్లించాల్సిందిగా ఈ నెల ఐదున ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా సూచించింది. పరిశ్రమలపై తీసుకున్న చర్యలను ఈనెల 12న హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించింది.

అభ్యంతరం

ఈ కేసులో హరిత ట్రిబ్యునల్ దిల్లీ ప్రధాన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పర్యావరణ రుసుమును 365 ఉల్లంఘన దినాలకు మాత్రమే వర్తింపజేయడంపై పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెయ్యికి పైగా రోజుల వరకూ ఉల్లంఘన దినాలున్నాయని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అంగీకరిస్తూనే , కేవలం 365 రోజులకు పరిమితం చేశారని బెంచ్‌కు వివరించారు. వాస్తవానికి ఔషధ కంపెనీలు 2013 నుంచే కాలుష్యం వెదజల్లుతున్నాయని నివేదించారు.

ఎందుకంత జాలి?

పరిశ్రమల పట్ల ఎందుకు ఉదారత కనబరిచారని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. పరిశ్రమలతో చర్చించాకే 365 ఉల్లంఘన దినాలకు అపరాధ రుసుం వేశామని ఆయన ఇచ్చిన వివరణను తోసిపుచ్చిన ధర్మాసనం ఉల్లంఘనలు గుర్తించిన అన్ని రోజులను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ఆదేశించింది.

మొదలైనప్పటి నుంచే లెక్క

పీసీబీ తీరుపై పిటిషన్‌దారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచి కాలుష్యం మొదలైందో అప్పటి నుంచే నష్టాన్ని లెక్కగట్టాలని కోరుతున్నారు. మొత్తం 9 పరిశ్రమలకు కలిపి సుమారు కోటి 55లక్షలు పర్యావరణ పరిహారాన్ని చెల్లించాలని అంచనా వేయగా.. ట్రైబ్యునల్ ఆదేశాలతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.