నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మీదుగా వెళ్లే మిషన్ భగీరథ మెయిన్ పైపు లీక్ కావడం వల్ల భారీగా నీళ్లు వృథాగా పోయాయి. మండలంలోని చందాపూర్ గ్రామ సమీపంలోని 127వ జాతీయ రహదారి పక్కన పైప్లైన్ వాల్వ్ లీక్ అయినట్టు గమనించిన గ్రామస్తులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
వేసవిలో నీటివృథాను అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.