హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తెరాస అభ్యర్థి వాణీదేవి విజయం తథ్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన పట్టభద్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 55 శాతంగా ఉన్న పోలింగ్ శాతం ఈసారి పెరగడంపై శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికిది నిదర్శనమన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, ఫలితాల అనంతరం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఓటర్ల నమోదు దగ్గర్నుంచి పోలింగ్ ముగిసే వరకూ తెరాస అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల ముగిసే వరకే పార్టీల మధ్య రాజకీయాలుండాలన్న ఆయన.. రాష్ట్రాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
ఇవీచూడండి: భారీగా తరలివచ్చిన పట్టభద్రులు... 60 శాతానికి పైగా పోలింగ్!