ETV Bharat / city

రైతులకు భారంగా మారుతున్న పశువుల బీమా పథకం

పశువులు చనిపోతే వచ్చే బీమా సొమ్మును లబ్ధిదారుని ఖాతాలో వేయాల్సిన సర్కారు.. ఆ డబ్బుతో మరో పశువు కొనుగోలు చేయాలని నిబంధన విధించింది. వేరే రాష్ట్రాల్లోనే పశువుల్ని కొనాలని స్పష్టంచేస్తోంది. ఈనిబంధన వెనక ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా.. లబ్ధిదారులకు భారంగా మారుతోంది. 30 వేల విలువ చేయని పశువుల్ని... పక్కా రాష్ట్రాల్లో 70వేలకు అంటగడుతున్నారని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పాడిరైతులు ఆరోపిస్తున్నారు.

ox
ox
author img

By

Published : Mar 23, 2022, 7:49 PM IST

రైతులకు భారంగా మారుతున్న పశువుల బీమా పథకం

పాడిరైతులకు ఆవులు, గేదెల్ని పంపిణీ చేసే పథకంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు లబ్ధిదారులకు భారంగా మారుతున్నాయి. పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో విజయ, నార్ముల్, ముల్కనూరు, కరీంనగర్ డైరీలు గుర్తించిన లబ్ధిదారులకు 2018-19, 2019-20లో ఆవులు-గేదెల్ని రాయితీపై పంపిణీ చేశారు.

పశువుధర, మూడేళ్ల బీమా, పశుగ్రాసం, రవాణా ఖర్చులు కలుపుకుని యూనిట్ ధర 80వేలుగా నిర్ణయించారు. అందులో లబ్ధిదారుని వాటా 40వేలు, ఎస్సీ, ఎస్టీలైతే 20వేలు చెల్లిస్తే మిగిలింది ప్రభుత్వం రాయితీగా అందించింది. మూడేళ్లలోపు పశువు చనిపోతే 70 వేలు బీమా సొమ్ము వర్తిస్తుంది.

నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 7,741 పశువుల్ని కొనుగోలు చేయగా అందులో 964 పశువులు మృతి చెందాయి. నెల, రెండు నెలల్లోపు 70వేల సొమ్మును లబ్ధిదారునికి చెల్లించాలి. కానీ ఈ పథకంలో బీమాసొమ్ము కలెక్టర్ ఖాతాలో జమచేశారు. మూడేళ్ల తర్వాత 70వేలతో మరోపశువు కొనుగోలు చేయాలని సూచించారు.

మూడేళ్లుగా బీమా సొమ్మురాక సమయం, పాలఉత్పత్తి ఆదాయాన్ని రైతులు కోల్పోవాల్సి వచ్చింది. బీమా సొమ్ముతో మరోపశువును పక్కరాష్ట్రాల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించడం రైతులకు భారంగా మారుతోంది. స్థానికంగా కొనుగోలు చేస్తే పాలఉత్పత్తి, పశువుల సంఖ్య పెరగదన్నది ప్రభుత్వం వాదన.

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల లబ్ధిదారులు ఆవులైతే చిత్తూరు జిల్లా పుంగనూరు, గేదెలైతే ఉండికి వెళ్లాలని ప్రభుత్వం నిబంధన విధించింది. తీరా అక్కడకు వెళ్తే 20వేల నుంచి 30వేలు విలువచేసే పశువుకు 70వేలు చెబుతున్నారని, మేలురకం ఆవులు, గేదెలకు లక్ష నుంచి లక్షా 20వేలు ధర చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వద్దంటే బీమా సొమ్ము రాదన్న భయంతో గత్యంతరం లేక దళారులు చూపిన పశువుల్నే కొనుగోలు చేస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి తీసుకువచ్చినా పాలదిగుబడి పూటకు గరిష్ఠంగా 5 లీటర్లు దాటడం లేదని వాపోతున్నారు. బీమా సొమ్ముతో స్థానికంగానే పశువుల్ని కొనుగోలు చేస్తే 30 నుంచి 50 వేలల్లో పూటకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే పశువుల్నికొనుగోలు చేయవచ్చన్నది రైతుల వాదన. పైగా రవాణా ఖర్చుల భారం ఉండదు.

ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ఆవులు, గేదెలకు ఇక్కడి వాతావరణం అలవాటు పడక తెచ్చిన కొద్దిరోజులకే తనువు చాలిస్తున్నాయి. కొన్నిఅనారోగ్యంతో బక్కచిక్కిపోతున్నాయి. వాటి చికిత్స, దాణ సహా నిర్వాహణ ఖర్చులు భారంగా మారుతున్నాయని రైతులంటున్నారు.

అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకే పథకాన్ని అమలుచేస్తున్నామని చెబుతున్నారు. ధరలు అధికంగా చెబుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, పశువును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లబ్ధిదారులదేనని అంటున్నారు. ఒక్కోజిల్లా లబ్ధిదారులు ఒక్కో ప్రాంతంలో పశువుల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చిందని, స్థానిక కొనుగోళ్లకు నిబంధనలు అనుమతించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పథకం అమలు తీరులో ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా అధికారులు, పక్కరాష్ట్రంలోని దళారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నుంచైనా లబ్దిదారులకు న్యాయం జరిగేలా పాడిపశువుల పంపిణీ జరగాలని రైతులు వేడుకుంటున్నారు.

2018-19, 2019-20లో డైరీ రైతులకు పాలిచ్చే పశువుల పంపిణీ పథకం వివరాలు

#మహబూబ్​నగర్నాగర్ కర్నూల్
పంపిణీ చేసినవి21965545
చనిపోయినవి 456508
బీమా వర్తించినవి379406
బీమా కింద పశువులిచ్చినవి 343355
అందులో చనిపోయినవి0202

ఇదీ చదవండి : అర్ధరాత్రి పరుగుతో సంచలనం- సాయం చేస్తామని ఎందరో ముందుకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.