జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనానికి నేటి నుంచి భక్తులను అనుమతించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి స్వామి వారు, అమ్మవార్ల ఆలయాల్లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు సాధారణ దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఆర్జిత సేవలు ఉదయం ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు.. మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు కొనసాగుతాయి.
![jogulamna skthipetam allowed to devotees to darshan from today with follow the covid gidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9052862_153_9052862_1601878610920.png)
ప్రభుత్వం నిబంధనలకు లోబడి అభిషేకం, అష్టోత్తర అర్చన టికెట్లు రోజుకు 24 మాత్రమే జారీ చేయనున్నారు. ఒక్కొ టికెట్‌పై ఇద్దరిని మాత్రమే అభిషేకానికి అనుమతిస్తున్నారు. అమ్మవారి త్రిశక్తి అర్చన కొరకు 14 టికెట్లు, ఖడ్గమాల అర్చన కొరకు రోజుకు 10 టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలో పాల్గొనాలని ఈఓ ప్రేమ్ కుమార్ కోరారు.
ఇవీ చూడండి: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల