ETV Bharat / city

Treatment to Cobra: నాగుపాముకి శస్త్ర చికిత్స... ఎందుకో తెలుసా.?

Treatment to Cobra: ఏదైనా విషపురుగు కనిపించిందంటేనే ఆమడదూరం పరిగెడుతాం. అందులో మరి నాగుపాము అంటే ఇంకా బెంబేలెత్తిపోయి భయంతో వణికిపోతాం. అలాంటి మూగజీవి బాధలో ఉంటే ఎవరైనా దాని వైపు కన్నెత్తి అయినా చూడరు. కానీ వనపర్తికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా గాయపడిన ఆ విషసర్పానికి వైద్యచికిత్స అందించారు. నాగుపాముకి వైద్యచికిత్స ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అయితే అదేంటో మీరే చూడండి...

Treatment to Cobra
నాగుపాముకి శస్త్ర చికిత్స
author img

By

Published : Mar 21, 2022, 11:56 AM IST

Treatment to Cobra: పాములాంటి మూగజీవి బాధలో ఉంటే ఎవరూ ఆదుకునే సాహసం అసలు చేయరు. అందునా విషసర్పమైన నాగుపాము విషయంలో అసలు అడుగుముందుకేయరు. అలాంటిది పాములను సజీవంగా పట్టుకుని అడవుల్లో వదులుతూ పర్యవరణ పరిరక్షణకు సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్ దోహదపడుతున్నారు. ఆదివారం వనపర్తిలో ఆయన ఓ గాయపడిన నాగుపామును పట్టుకుని దానికి చికిత్స చేయించారు.

Treatment to Cobra
నాగుపాముకి శస్త్ర చికిత్స అందిస్తున్న వైద్యులు

అసలేం జరిగిందంటే..

Treatment to Snake: వనపర్తి కొత్తకోట రోడ్డులోని భగీరథ చౌరస్తాలో ఒక ఇంటిని నిర్మిస్తున్నారు. మట్టిపెడ్డల కింద దాగున్న నాగుపాముపై మట్టిపెడ్డ పడడంతో దాని నడుము విరిగి అది కదలలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దానిని గమనించిన స్థానికులు వెంటనే కృష్ణసాగర్​కు సమాచారమిచ్చారు. గాయపడిన పామును ఆయన వైద్యుడు శ్రీనివాసరెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు.

Treatment to Cobra
ఎక్స్​రే తీయగా నాగుపాముకి నడుము వద్ద విరిగిన ఎముకలు

అక్కడే పాముకు ఎక్స్​రే తీయగా నడుము వద్ద ఎముకలు విరిగినట్లుగా గుర్తించారు. పశువైద్యాధికారి ఆంజనేయులు సమక్షంలో సర్పానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (సిమెంటుపట్టి) వేసి చికిత్స అందించారు. పాముకు వైద్య చికిత్స అందించిన కృష్ణసాగర్​ను అందరూ అభినందించారు. సర్పాలు కనిపిస్తే తనకు సమాచారమివ్వాలని, చంపవద్దని ఆయన కోరారు. గతంలోనూ ఇలా ఒక పాము కరెంటుతీగలో చిక్కుకుంటే చికిత్స చేయించామని గుర్తుచేశారు.

Treatment to Cobra
నాగుపాముకి శస్త్ర చికిత్స

ఇదీ చదవండి:Father raped Daughters : కన్నతండ్రే కాటేస్తే.. చావే శరణమనుకున్నారు కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.