ETV Bharat / city

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిపమాదం - తెలంగాణ తాజా వార్తలు

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిపమాదం

author img

By

Published : Aug 21, 2020, 3:34 AM IST

Updated : Aug 21, 2020, 4:18 AM IST

03:32 August 21

భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిపమాదం

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిపమాదం

  శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిపమాదం జరిగింది. డ్యామ్​లోని ఎడమగట్టు జలవిద్యుత్​ కేంద్రంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు విద్యుత్​ ఉత్పత్తి నిలిపివేయడం వల్ల మంటలు ఆరిపోయాయి. తొమ్మిది మంది సిబ్బంది లోపల చిక్కుకుపోయారు. లోపల ఉండిపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్‌ శర్మన్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  

మూడు చోట్ల అత్యవరస దారులు ఉన్నాయని... వాటి ద్వారా సిబ్బంది బయటకొచ్చే అవకాశం ఉందని జెన్‌కో  సీఈ సురేష్‌ తెలిపారు. ఇప్పటి వరకు అందరూ సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నామని... పొగలు తగ్గిన తర్వాత పూర్తి సమాచారం అందుతుందని పేర్కొన్నారు.  

Last Updated : Aug 21, 2020, 4:18 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.