ETV Bharat / city

వట్టెం జలాశయ భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్​ - undefined

నాగర్‌కర్నూలు జిల్లా  వట్టెం జలాశయం వద్ద భూనిర్వాసితుల దీక్ష 11 రోజుకు చేరింది. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌  సంఘీభావం తెలిపింది. దీక్షా స్థలికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి, నాగం జనార్దన్‌రెడ్డి చేరుకుని మద్దతు తెలిపారు.

వట్టెం జలాశయ భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్​
author img

By

Published : May 17, 2019, 1:57 PM IST

Updated : May 17, 2019, 6:18 PM IST

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితుల దీక్షకు కాంగ్రెస్​ పార్టీ మద్దతు తెలిపింది. దీక్షా స్థలికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి, నాగం జనార్దన్‌రెడ్డి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. గత పది రోజులుగా హెచ్​ఈఎస్ కంపెనీ ముందు ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలతో పాటు గత మూడు రోజుల నుంచి 11 మంది నిర్వాసితులు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం పోలీసులు దీక్ష చేపట్టిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. ఈ సమయంలో నిర్వాసితులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీక్షలో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

ఆందోళనకు కాంగ్రెస్‌ సంఘీభావం

ఇవీ చూడండి: అధికారులకు స్మితా సబర్వాల్ వార్నింగ్

Last Updated : May 17, 2019, 6:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.