యాసంగిలో ఇప్పటి వరకు పంట రుణాలు తీసుకోని రైతులను గుర్తించి.. వారు రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా అధికారులను కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా సహకార బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖ అధికారులతో పాటు బ్యాంకర్ల సమన్వయంతో.. రైతులకు ప్రయోజనం చేకూరేలా పని చేయాలని సూచించారు.
రసాయన ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులను వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. వ్యవసాయ శాఖ, రైతు బంధు సమితి, సహకార బ్యాంకు అధికారులు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు, 2 మరణాలు