ETV Bharat / city

Singareni: సింగరేణిని అభినందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి - singareni collieries profit

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి.. సింగరేణి సంస్థను అభినందిస్తూ ట్వీట్​ చేశారు. లాభాల్లో వృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.303 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా.. 2021-22లో మొదటి మూడు నెలల్లో రూ.800 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

union minister prizes singareni
union minister prizes singareni
author img

By

Published : Aug 6, 2021, 9:28 PM IST

లాభాల్లో భారీ వృద్ధిని సాధించినందుకు సింగరేణిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. వృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. గతేడాది ఏప్రిల్-జులైతో పోల్చితే 2021లో అదే సమయంలో లాభాల్లో 364 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.303 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా.. 2021-22లో మొదటి మూడు నెలల్లో రూ.800 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిని రికార్డు స్థాయిలో వృద్ధి సాధించటంతో ఈ స్థాయి లాభాలు వచ్చాయి. ఆదాయం పరంగానూ గతేడాదితో పోల్చితే 72 శాతం వృద్ధి నమోదైంది.

లాభాలు ఆర్జించాం

కరోనా పరిస్థితిని అధిగమించి ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.8,180 కోట్ల టర్నోవర్‌ సాధించి రికార్డు నెలకొల్పామని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ గురువారం వెల్లడించారు. గతేడాది ఇదే కాలానికి సింగరేణి సాధించిన రూ.4,748 కోట్ల టర్నోవర్​పై ఇది 72 శాతం అధికం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో 800 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు శ్రీధర్‌ తెలిపారు.

గతేడాది ఇదే కాలానికి 303 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసిన కంపెనీ ఈ ఏడాది సాధించిన అద్భుతమైన టర్నోవర్‌ రీత్యా.. 364 శాతం వృద్ధితో లాభాలను సాధించినట్లు సీఎండీ వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.6,949 కోట్ల టర్నోవర్‌ సాధించి.. గతేడాది ఇదే కాలానికి సాధించిన రూ.3,816 కోట్ల బొగ్గు అమ్మకాల టర్నోవర్​పై 82 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.

ఇదీచూడండి: Singareni Turnover: సింగరేణి రికార్డు.. మొదటి నాలుగు నెలల్లోనే రూ.800 కోట్ల లాభాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.