ETV Bharat / city

గొప్పింటి బిడ్డ ఒంటరిగా మిగిలింది..! - ఆపనన హస్తం కోసం వృద్ధురాలి ఎదురుచూపు

నలుగురు సంతానంలో గారాబంగా పెరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి కూతురిగా గొప్ప జీవితమే అనుభవించింది. పెళ్లి చేసుకోకుండా అన్నల దగ్గర ఒంటరిగా ఉన్నా... ఏ లోటు లేకుండా చూసుకున్నారు. కానీ కాలం గిర్రున తిరిగింది.. అనాథలా రోడ్డుపై జీవితం వెళ్లదీస్తోంది.

The child of a great home that became an orphan
గొప్పింటి బిడ్డ ఒంటరిగా మిగిలింది
author img

By

Published : Apr 30, 2020, 12:04 AM IST

ఖమ్మం రైల్వే స్టేషన్​ రోడ్డులో మూసిన దుకాణం ఎదుట బేలగా కూర్చున్న ఈ వృద్ధురాలు పేరు దుడ్డు సుబ్బలక్ష్మి. ఈ పూటకు ఎవరైనా బుక్కెడు బువ్వ పెట్టకపోతారా అని దీనంగా ఎదురుచూస్తున్న సుబ్బలక్ష్మి... ఒకప్పుడు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన సూర్యనారాయణ నలుగురు సంతానంలో చిన్న కూతురు.

సుబ్బలక్ష్మికి ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఇప్పుడు ఆ ముగ్గురు చనిపోయారు. సుబ్బలక్ష్మి మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. అన్నలు ఉన్నప్పుడు మంచిగానే చూసుకున్నారు. సోదరుల పిల్లలంతా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడ్డప్పటి నుంచి బంధువుల దగ్గర ఉండేది. ఇటీవల బయటికి వచ్చి.. రోడ్డు మీద కాలం వెళ్లదీస్తోంది. ఎవరైనా అనాథ ఆశ్రమంలో చేరిస్తే అక్కడే ఉంటానంటోంది.

ఇదీ చూడండి: వలస కూలీల తరలింపునకు నోడల్ అధికారుల నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.