రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరించే సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్‌ల 'డ్రై రన్' ఉంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారు పెంటా రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని కొత్తూరు వద్ద నిర్మిస్తోన్న ఆ ప్రాజెక్టు పంపు హౌస్‌ను ఆయన బుధవారం సందర్శించారు.
సీతారామ ప్రాజెక్ట్‌లోని అన్ని పంప్ హౌస్‌లలో చైనాకు చెందిన షాంఘాయ్ పంపులను ఏర్పాటు చేశామని పెంటా రెడ్డి తెలిపారు. ఆ కంపెనీ సమక్షంలో పంప్ హౌస్‌ల డ్రై రన్ ఉంటుందన్న ఆయన ఒక వేళ ఆ సంస్థ అధికారులు అందుబాటులో లేని పక్షంలో వారు ఆ పంపులపై గ్యారెంటీ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వీకే రామవరం లోని ఫేజ్ -1, కమలాపురం లోని ఫేజ్-2 పంప్ హౌస్ లను కూడా పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తానని అన్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో నెలలో డ్రై రన్ చేసేందుకు అవకాశం ఉందన్న ఆయన పంప్ హౌస్ నిర్మాణం పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని వివరించారు.
ఇదీ చదవండి :'గీత మా అమ్మాయే.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్నాం'