Bhadradri temple: భద్రాద్రి రామయ్య సోమవారం ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ప్రధాన ఆలయంలోని సీతారాముల ఉత్సవమూర్తులను వెండి రథంలో ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ వెండి రథాన్ని లాగుతూ ' శ్రీ రామ.. జయ రామ.. జయ జయ రామ ' అంటూ భక్తులు స్వామివారి నామాన్ని వేడుకున్నారు.
ఆన్లైన్లో కల్యాణం, మహా పట్టాభిషేకం టికెట్లు...
ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి సన్నహిక వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీన సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం, 10న సీతారాముల కళ్యాణం, 11న మహా పట్టాభిషేకం ఉత్సవాలు నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవానికి టికెట్లను ఆన్లైన్లో ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి 16 వరకు నిత్యకళ్యాణాలను నిలిపివేయనున్నారు.
ఇదీ చదవండి:Yadadri Temple News: నేటి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభం