ఇవీ చూడండి:శరత్... నేను కేసీఆర్ను మాట్లాడుతున్నా...!
మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ సర్కార్ బినామీ: రేణుక - loksabha
కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్యకర్తలే బలమని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పని చేసి హస్తం పార్టీ సత్తా ఏంటో చూపించాలని కార్యకర్తలకు నిర్దేశించారు.
కార్యకర్తలే కాంగ్రెస్కు బలం
మోదీ ప్రభుత్వానికి తెరాస సర్కార్ బినామీగా వ్యవహరిస్తోందని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గాలి తీసే సత్తా చేతికి ఉందన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి కార్యకర్తలు ఎమ్మెల్యేలను గెలిపిస్తే... కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రజాప్రతినిధుల్ని కొన్న తెరాసకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. నాయకులు కాదు.. కార్యకర్తలే హస్తంకు బలమన్నారు. ఎన్నికల వరకు అంతా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
ఇవీ చూడండి:శరత్... నేను కేసీఆర్ను మాట్లాడుతున్నా...!
sample description