భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని యూబీ రోడ్డులో గల అంబేద్కర్ సంయుక్త వైద్యశాల అనే ప్రైవేట్ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఈ నెల 22న ఇదే ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు మహిళకు గర్భవిచ్ఛితి చేశాడు. సదరు వైద్యుడి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆస్పత్రిని సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు నడిపి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే.. తీవ్ర చర్యలుంటాయని జిల్లా డీహెచ్ఎంఓ భాస్కర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి:సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!