ETV Bharat / city

'కరోనాకి చంపే శక్తి లేదు.. కానీ నిర్లక్ష్యం వహిస్తే మూల్యం తప్పదు' - కొవిడ్​ ట్రూనాట్​ పరీక్షల కేంద్రం ప్రారంభం

కొవిడ్​ ట్రూనాట్​ పరీక్షల కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్, మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​తో కలిసి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించారు. అనంతరం వైద్యశాఖ అధికారులతో మంత్రులు భేటీ కానున్నారు.

covid trunot testing center at khammam
ఖమ్మంలో కొవిడ్​ ట్రూనాట్​ పరీక్షల కేంద్రం ప్రారంభం
author img

By

Published : Jul 31, 2020, 11:47 AM IST

Updated : Jul 31, 2020, 3:06 PM IST

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌ ట్రూనాట్‌ పరీక్షల కేంద్రాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించారు. మమత ఆసుపత్రిలో ఆర్​టీపీసీఆర్ ల్యాబ్‌, కొవిడ్‌ వార్డును ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారులో మంత్రులు సమావేశమయ్యారు. నాలుగు నెలలుగా ప్రజలకు ధైర్యం చెప్పిన వైద్యులకు మంత్రి ఈటల అభినందనలు తెలిపారు.

''ప్రైవేటు వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యం పనిచేస్తుంది. కరోనా వైరస్‌కి చంప గలిగే శక్తి లేదు.. నిర్లక్ష్యంగా ఉంటే చంపుతుంది. పాజిటివ్ కేసులలో 81శాతం ఎలాంటి లక్షణాలు లేవు. పాజిటివ్ కేసులలో 19శాతం లక్షణాలు ఉంటున్నాయి. పాజిటివ్ కేసులలో 14శాతం వైద్యుల చికిత్సతో నయం అవుతున్నాయి. వ్యాధులుండి కరోనా సోకినవారు 24గంటల్లో వైద్యులను సంప్రదించాలి. కరోనాతో శ్వాస ఆడటం లేదు అంటే నిర్లక్ష్యం వహించటమే.''

-మంత్రి ఈటల రాజేందర్

ఖమ్మంలో కొవిడ్​ ట్రూనాట్​ పరీక్షల కేంద్రం ప్రారంభం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేయనున్నారు. కొవిడ్‌ నిర్థరణ పరీక్షలు అందుబాటులోకి రావడం వల్ల వైరస్‌ను కట్టడి చేయొచ్చని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

Last Updated : Jul 31, 2020, 3:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.