ETV Bharat / city

తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్​ది ప్రముఖ పాత్ర: నామ - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెరాస లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎంపీ నామా ప్రార్ధించారు.

రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్  ప్రముఖ పాత్ర పోషించారు: నామా

author img

By

Published : Aug 31, 2020, 8:04 PM IST

Updated : Aug 31, 2020, 8:45 PM IST

భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెరాస లోక్​సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. 15వ లోక్ సభలో లీడర్ ఆఫ్ ద హౌస్​గా ఉన్న సమయంలో ప్రణబ్​తో కలసి పనిచేసిన విషయం ఈ సందర్భంగా ఎంపీ నామా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బిల్లుపై రాజముద్ర వేయటం రాష్ట్ర ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అభిప్రాయపడ్డారు.

ప్రణబ్ గొప్ప నాయకుడు, మేధావి, ట్రబుల్ షూటర్​అని కొనియాడారు. ప్రణబ్​ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆత్మకు శాంతి కలగాలని ఎంపీ నామ ప్రార్ధించారు.

ఇవీ చూడండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

Last Updated : Aug 31, 2020, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.