రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... రోడ్డు భత్రత వారోత్సవాల సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నగరంలో బైక్‌పైనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అందుకోసం ఓ బుల్లెట్ వాహనాన్ని కొనుకున్నారు.
ఎస్కర్టు వారు కూడా ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రి వెంట తిరిగే నాయకులు బైక్‌లు సమకూర్చుకోవాలన్నారు. జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు మంత్రి సొంత ఖర్చులతో కొనిస్తానని ప్రకటించారు. ఇవాళ నగరంలో బైక్‌పైనే ర్యాలీ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'నినాదాలు, ప్రసంగాలతో దేశాభివృద్ధి సాధ్యం కాదు'