ఛత్తీస్ఘడ్ రాష్ట్రం రామాపురం గ్రామానికి చెందిన 12 మంది వలస కార్మికులు బల్లేపల్లిలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కార్మికులు వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బయలుదేరారు. రెండు రోజుల క్రితం బయలుదేరిన కార్మికులు శనివారం మణుగూరుకు చేరుకున్నారు.
మణుగూరు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకొని అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ నారాయణమూర్తి, సీఐ షూకూర్ అక్కడికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వారికి ఆహారం , తాగు నీరు అందించారు. తహసీల్దార్ నారాయణమూర్తి వారిని ప్రత్యేక వాహనంలో ఖమ్మం తరలించారు.