కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు మనుషులు మాస్కులు ధరించడం చూశాం. మేకలు మాస్కులతో తిరగడం ఎక్కడైనా చూశారా? ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ఎన్టీఆర్ కాలనీకి చెందిన కె. వెంకటేశ్వరరావు తాను పెంచుతున్న మేకలకు మాస్కులు కట్టాడు.
అమెరికాలో ఓ పులికి వైరస్ సోకిందని తెలుసుకుని తన జీవాలకు మహమ్మారి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇవీ చూడండి: ఇకపై మూడు విభాగాలుగా కరోనా ఆసుపత్రులు