ETV Bharat / city

ఉన్నదంతా ఊడ్చేస్తున్న కరోనా.. ఆర్థికంగా చితికిన బాధితులు - మానసికంగా కుంగిపోయిన కొవిడ్ బాధిత కుటుంబాలు

కరోనా బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వైరస్​ సోకి ఆరోగ్య పరంగా బలహీనమవుతున్నవారు... మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. వైరస్​ సోకిందంటే... ఆసుపత్రులకు లక్షలు చెల్లించుకోవాల్సిందే. స్థోమత ఉన్నవారు పరిస్థితి ఫర్వాలేదు... పేద, మధ్య తరగతివారు మాత్రం పిల్లల చదువులు, పెళ్లిళ్లు, భవిష్యత్​ అవసరాల కోసం దాచుకున్న సొమ్ము వదిలించుకోవాల్సి వస్తోంది. అంతే కాకుండా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్ బాధితుల ఆర్థిక పరిస్థితులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

corona victims families facing mental and finacial problems
ఉన్నదంతా ఊడ్చేస్తున్న కరోనా.. ఆర్థికంగా చితికిన బాధితులు
author img

By

Published : Sep 22, 2020, 10:36 AM IST

ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడిది నిరుపేద కుటుంబం. రోజూ వాహనాలకు రేడియం స్టికర్లు వేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లికి, సోదరికి, యువకుడికి కూడా కరోనా సోకింది. ముగ్గురికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చైంది. చేతిలో చిల్లిగవ్వ లేక ఇంటి స్థలాన్ని అమ్మేశాడు.

బోనకల్​ మండలం ముష్టికుంటకు చెందిన ఓ ఆర్​ఎంపీకి... వైరస్​ సోకింది. విజయవాడ, హైదరాబాద్​లోని పలు కార్పొరేట్​ ఆసుపత్రుల్లో చికిత్స కోసం... దాదాపు రూ.25 లక్షలకుపైనే వైద్యం చేశాడు. చివరికి ప్లాస్మాథెరఫీ చేయించినా ఫలితం లేదు. ఈ నెల 5న చనిపోయాడు.

నగరంలోని గాంధీ చౌక్​కు చెందిన ఓ వ్యాపారికి వైరస్​ సోకింది. అతని నుంచి ఇంట్లో 12మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ ఒక్క కుటుంబమే దాదాపు రూ.25 నుంచి 30లక్షల వరకు ఖర్చు చేసింది. అయినా కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ... మానసికంగా తీవ్రంగా కుంగిపోవాల్సి వచ్చింది.

కొడిజర్ల మండలంలోని ఓ ఆలయ పూజరికి నెల రోజుల క్రితం కరోనా సోకింది. 10 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్సకు రూ.9లక్షల వరకు దారపోశాడు. దీంట్లో రూ.6లక్షలు అప్పెనట. అరకొర సంపాదనతో నెట్టుకొచ్చే ఈ కుటుంబపై తీరని భారం పడిందిప్పుడు.

corona victims families facing mental and finacial problems
ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల వివరాలు

ఆర్థికంగా చితికిన బాధిత కుటుంబాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాధిత కుటుంబాలను కరోనా మహమ్మారి ఆగమాగం చేస్తోంది. అసలే కొవిడ్ భయంతో నిత్యం దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న బాధితుల్ని... పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా వణికిస్తోంది. ఎక్కువ శాతం మంది తమకెలా వైరస్ సోకిందో కూడా తెలసుకోలేని పరిస్థితి ఉంది. వైరస్ ప్రభావం మొదలైన తొలి నాళ్లలో కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితమై కరోనా... ఇప్పుడు పల్లెలను కూడా తాకింది. ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వేలాది మంది బాధితుల్లో దాదాపు 60 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనో, హోం ఐసోలేషన్​లోనో ఉండి వైరస్​ను జయించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినవారు మాత్రం లక్షల రూపాయలు ధారపోయాల్సి వచ్చింది. పిల్లల చదువులు, పెళ్లిల్లు, భవిష్యత్​ కోసం పైసా పైసా కూడబెట్టుకున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితి బాధిత కుటుంబాలపై తీవ్ర ఆర్థిక ప్రభావమే చూపింది.

మందులు, పరీక్షల ఖర్చులే అధికం

కరోనా పాజిటివ్ వచ్చిన నాటి నుంచి కోలుకునే వరకు మందులు, పరీక్షలకే ఎక్కువ ఖర్చవుతోంది. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించినప్పటి నుంచి ఖర్చు మొదలవుతుంది. అక్కడ మళ్లీ ర్యాపిడ్, యాంటీజెన్, యాంటీబాడీ, ఆర్​టీ-పీసీఆర్, హెచ్​ఆర్. సీటీ స్కాన్ వంటి నిర్ధరణ పరీక్షలు చేస్తారు. పరిస్థితి ఆందోళనకరంగా మారి హైదారాబాద్​లోని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే... మళ్లీ అక్కడ ఇదే తంతు. ఇలా పరీక్షల రూపంలోనే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇక మందులకైతే లెక్కేలేదు. చీటీలో రాసిన మందులు తెచ్చివ్వడం తప్ప... మరో మాట్లాడే పరిస్థితి లేదు. చివరికి చూస్తే... లక్షల్లో వచ్చే బిల్లులు కరోనా కష్టాలకు సాక్షంగా నిలుస్తున్నారు.

కరోనా ఖర్చు కోట్లల్లోనే

జిల్లాలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఖమ్మం నగరంలోనేవే. నగరంలోని వ్యాపార సముదాయాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వందలాది మంది కొవిడ్ బారినపడ్డారు. ఒక్క గాంధీ చౌక్ ప్రాంతం నుంచే వందలాది మంది హైదరాబాద్ ఆసుపత్రుల్లో రోజుల తరబడి చికిత్సలు పొందారు. వీరిలో తక్కువలో తక్కువగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసిన వారు వందల సంఖ్యలోనే ఉన్నారు. 10 రోజులు దాటినా... పరిస్థితి కుదుటపడని వారు రూ. 15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇతర జబ్బులు వస్తే... కుటుంబసభ్యులు దగ్గరుండి చూసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో బాధితులు ఆర్థికంగానే కాకుండా... మానసికంగానూ కుంగిపోతున్నారు.

ఆస్పత్రి బిల్లులపై ఓ కన్నేయాలి

కొవిడ్ చికిత్సల కోసం జిల్లా కేంద్రంలో మొత్తం 8 ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కొన్ని విపరీతమైన బిల్లులు వసూలు చేస్తున్నాయి. మందులు, పరీక్షలకే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ సమయంలో ఇచ్చే బిల్లులు గుబులు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్​లో రోజుకు రూ. లక్ష వరకు బిల్లు వేస్తుంటే... ఖమ్మంలో రూ.50 వేల వరకు చెల్లించాలంటున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి 6 రోజుల నుంచి 12 రోజుల వరకు ఆసుపత్రిలో ఉంచుకొని... దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆసుపత్రి బిల్లులు భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

రెమిడిసివీర్ చాలా కాస్ట్ గురూ..

కొవిడ్ సోకిన వారిలో లక్షణాలు ఎక్కువ ఉంటే... రెమిడిసివీర్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తొలి రోజు రెండు, ఆ తర్వాత వరుసగా నాలుగు రోజులు రోజుకు ఒక్కటి చొప్పున ఇంజెక్షన్ ఇవ్వాలి. అయితే... రూ.5,400లు ఎమ్మార్పీ ధర ఉంటే... రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. ఒక్కోసారి ఇంజెక్షన్ కొరత పేరుతో రూ.20 వేలు కూడా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయినా బాధితులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకపోవడం ఆరోపణలకు మరింత ఊతమిస్తోంది.

ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు

కొవిడ్ వైద్య చికిత్సల కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా చికిత్సలు చేస్తున్న ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. చికిత్సలకు సంబంధించి మందుగా నిర్ణయించిన ధరల ప్రకారమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు. బాధితులు ఎవరైనా మా దృష్టికి అధిక బిల్లుల విషయం తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. రెమిడిసివీర్ ఇంజెక్షన్ ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తప్పవు.

-డాక్టర్ మాలతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.