కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు, ఒక జేసీబీని గ్రామస్తులు అడ్డుకున్నారు. లారీ,జేసీబీ టైర్లలో గాలితీసి.. పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీని మానకొండూర్ స్టేషన్‌కు తరలించారు. గ్రామస్తుల సాకారంతోనే ఇసుక మాఫియా బయటపడినట్లు సీఐ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా మధ్యవర్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
నాలుగు రోజుల్లో...
మండలంలో ఎక్కడ నుంచి అక్రమ ఇసుక రవాణా జరిగిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గత నాలుగు రోజుల్లోనే 20 ట్రాక్టర్లు పట్టుకుని కేసులు నమోదుచేశామని తెలిపారు. అయితే సమాచారమిస్తున్న అధికారులు సకాలంలో స్పందించడంలేదనే విమర్శ ప్రజల నుంచి వినిపిస్తోంది.
ఇవీ చూడండి: 'సెలవు ఇవ్వలేదనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది'