ETV Bharat / city

బస్తీమే సవాల్​: కరీంనగర్ జిల్లా​ పురపాలికల్లో తెరాస హవా

కరీంనగర్​ జిల్లాలోని నాలుగు పురపాలికల్లో అధికార పార్టీ తన పట్టు సాధించింది. అన్ని మున్సిపాలిటీలు కలిపి 86 వార్డులకు 63 స్థానాలను గెలుచుకొని విజయ ఢంకా మోగించింది.

బస్తీమే సవాల్​: కరీంనగర్​ పురపాలికలో తెరాస జెండా

author img

By

Published : Jan 25, 2020, 4:54 PM IST

Updated : Jan 26, 2020, 1:35 AM IST

కరీంగర్​ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగరవేసింది. మొత్తం 30 వార్డులున్న హుజూరాబాద్​లో 21 స్థానాలు కైవసం చేసుకుంది. ఇందులో రెండు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలినవాటిలో ఐదు భాజపా గెలుచుకోగా.. ఒక స్థానంతో కాంగ్రెస్​ సరిపెట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 3 వార్డులను సొంతం చేసుకున్నారు.

అలాగే 30 వార్డులున్న జమ్మికుంటలో కూడా కారు టాప్​ గేర్​లో వెళ్లి విజయం సాధించింది. ఇక్కడ 22 వార్డులను అధికార పార్టీ దక్కించుకోగా.. మూడింట హస్తం పార్టీ, ఇతరులు ఐదింటిని కైవసం చేసుకున్నారు.

చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో కూడా ప్రజలు గులాబీ పార్టీనే అందలం ఎక్కించారు. 14 వార్డులున్న చొప్పదండిలో తొమ్మిదింటిని తెరాస కైవసం చేసుకుంది. ఇందులో భాజపా, కాంగ్రెస్ ​ చెరో రెండు వార్డులు దక్కించుకున్నాయి. ఇతరులు ఒకటి గెలుచుకున్నారు. ​

కొత్తపల్లిలో పురపాలికలో 12 వార్డులకు గానూ 11 స్థానాలను కారు పార్టీ గెలవగా.. మిగిలిన ఒక వార్డును కాంగ్రెస్ దక్కించుకుంది. ​

trs-won-whole-karimnagar-municipalities
బస్తీమే సవాల్​: కరీంనగర్​ పురపాలికలో తెరాస జెండా

ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్​లో కార్యకర్తల ఊపు..

Last Updated : Jan 26, 2020, 1:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.