ETV Bharat / city

'500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం'

రామగుండం ఎన్టీపీసీ కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆరో యూనిట్​ టర్బైయిన్​లో సాంకేతిక సమస్య రాగా యూనిట్​ను నిలిపివేశారు. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

technical issue in ramagundam ntpc power generation was stopped
'500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం'
author img

By

Published : Aug 25, 2020, 8:31 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం కారణంగా ఆరో యూనిట్​లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. టర్బైయిన్​లో లోపాన్ని గుర్తించిన అధికారులు యూనిట్​ను నిలిపివేశారు. అనంతరం మరమ్మతులు ప్రారంభించారు.

రెండ్రోజుల క్రితం నాలుగో యూనిట్లో సాంకేతిక లోపం ఏర్పడగా మరమ్మత్తులు నిర్వహించి.. మంగళవారం మధ్యాహ్నం తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. ఒక యూనిట్ సిద్ధం కాగానే మరో యూనిట్​లో సాంకేతిక లోపం తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్టీపీసీలో 1900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.