ETV Bharat / city

sonu sood: మటన్​షాప్​ ఓనర్ సాయం​.. సోనూసూద్​ చమత్కారం..! - karimnagar mutton shop

ఎక్కడ, ఎవరికి సాయం అవసరమైనా... నేనున్నానంటూ ముందుకొస్తున్న సినీనటుడు సోనూసూద్​. ఆయన చేస్తున్న సేవలో తాము సైతం అంటూ... కొంతమంది సోనూసూద్​ ట్రస్ట్​కు తోచినంత సాయం చేస్తున్నారు. చిన్నాచితక వ్యాపారులు కూడా వారి ఆదాయంలో కొంతమేర సోనూభాయ్​కి ఇచ్చి తృప్తి పొందాలనుకుంటున్నారు. అంలాంటి ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సోనూసూద్ తనదైన శైలిలో​ స్పందించారు.

sonu sood reacted in Hilarious way on karimnagar mutton shop owner flexi

author img

By

Published : Jun 1, 2021, 5:11 PM IST

Updated : Jun 1, 2021, 5:59 PM IST

ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తంగా నిలుస్తున్న సినీనటుడు సోనూసూద్‌‌.. సోషల్​ మీడియాలో చాలా యాక్టీవ్​గా ఉంటారు. కరీంనగర్​కు చెందిన కన్నయ్య పెట్టిన ఫైక్సీపై సోనూ.. స్పందిచిన తీరు ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. మాంసం దుకాణాన్ని నిర్వహించే కన్నయ్య... తన సంపాదనలో కొంతమేర సోనూసూద్‌‌ ట్రస్ట్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు. కిలో మాంసం అమ్మితే వచ్చే సొమ్ములో 50 రూపాయలు.. సోనుసూద్‌ ట్రస్ట్​కు ఇస్తానని నిర్ణయించుకున్నాడు. తాను చేయదలుచుకున్న ఈ పనికి ప్రజలకు తెలిసేలా.. దుకాణం ముందు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఆ ఫెక్సీపై సోనుసూద్‌‌ చిత్రాన్ని కూడా ముద్రించారు.

ఈ ఫ్లెక్సీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ సోనూకు చేరింది. ఫొటో చూసిన సోనూ.. కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తనదైన శైలిలో చమత్కరిస్తూ స్పందించారు. "పూర్తిగా శాఖహారినైన నా పేరు మీద మటన్​ దుకాణమా..? నా పేరుతో మాంసపు దుకాణం వద్దు. అవసరమైతే శాఖహార వ్యాపారం కోసం నేను ఆర్థిక సాయం చేస్తా." అంటూ సోషల్​ మీడియాలో స్పందించాడు సోనూ. నిజానికి... ఆ దుకాణం కన్నయ్య పేరు మీదే ఉండగా... సోనూకు మాత్రం తన పేరుపైనే ఉందనుకుని స్పందించారు.

ఈ అపార్థానికంతటికీ కారణం.. ఆ ఫ్లెక్సీ తెలుగులో ఉండటమే కావచ్చని కన్నయ్య అభిప్రాయపడ్డారు. తన దుకాణానికి సోనూసూద్​ పేరు పెట్టలేదని స్పష్టం చేశారు. తాను మాత్రం సోనూసూద్​ ట్రస్ట్​కు సాయం చేస్తామని తెలిపారు.

మటన్​షాప్​ ఓనర్ సాయం​.. సోనూసూద్​ చమత్కారం..!

ఇదీ చూడండి: టాలీవుడ్​ యాంకర్​పై సోనూసూద్ ప్రశంసలు

Last Updated : Jun 1, 2021, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.