ETV Bharat / city

రాజన్నా... సిరిసిల్లలో ఆవాస భాగ్యమెప్పుడు..? - రెండుపడకలగదుల కోసం పేదల ఎదురుచూపు

Double Bedrooms in Sircilla: గేటెడ్‌ కమ్యూనిటీకి తీసిపోని విధంగా ఇళ్ల నిర్మాణం. ఆహ్లాదం పంచేలా ఆటవస్తువులు, సేదతీరేందుకు ఉద్యానవనాలు, కసరత్తులు చేసేందుకు వ్యాయామశాలలు... ఇలా సకల హంగులతో రూపుదిద్దుకున్న 2 పడక గదుల ఇళ్లు.... గృహప్రవేశాలకు మాత్రం నోచుకోవటంలేదు. సొంతింటి కల ఇక నిజమవుతుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు.. ఏళ్లు గడుస్తున్నా స్వప్నం నెరవేరటంలేదు. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో నిర్మానుష్యంగా మారి... అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన... ప్రభుత్వ గృహాలపై ప్రత్యేక కథనం.

Double Bedrooms
Double Bedrooms
author img

By

Published : Jul 9, 2022, 1:35 PM IST

రాజన్నా... సిరిసిల్లలో ఆవాస భాగ్యమెప్పుడు..?

Double Bedrooms in Sircilla: చూస్తున్నారుగా... ఇదెక్కడో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్‌ కాదు... మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ‌ళ్లప‌ల్లి మండ‌లం మండేప‌ల్లిలో ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయం. 30 ఎక‌రాల్లో నిర్మించిన 1320 గృహాలను గత ఏడాది జులైలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీటిని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులకు ఈ సముదాయంలో ఆరుగురికి అందజేశారు. ఏడాది గడుస్తున్నా... మిగ‌తా ఇళ్లను లబ్ధిదారుల‌కు ఇవ్వడం మాత్రం మ‌రిచిపోయారు. 1320 ఇళ్లలో కేవ‌లం ప‌దిఇర‌వై మంది మాత్రమే లబ్ధిదారులు మాత్రమే ఇళ్లలోకి వచ్చారు. మిగ‌తా వంద‌లాది ఇళ్లన్నీ ఖాళీగానే ద‌ర్శనమిస్తున్నాయి.

సిరిసిల్ల మున్సిపాలిటీలో 117కోట్ల71లక్షలతో 2వేల 52 ఇళ్లను నిర్మించారు.ఇందులో అర్హత సాధించిన లబ్ధిదారులు 2వేల 767 ఉండగా... లాటరీ పద్దతిన 1,804మందిని ఎంపిక చేశారు. మరో 968మంది మిగిలి ఉన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టి కూడా ఏళ్లు గడుస్తుండగా... ఇప్పటికే చాలా చోట్ల శిథిలమయ్యే పరిస్థితి నెలకొంది. గదులు పలుచోట్ల నెర్రలు బారుతున్నాయి. కిటికీల అద్దాలు, తలుపులు విరిగిపోగా... నీటిట్యాంకుల మూతలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ గృహసముదాయం మందుబాబుబు మద్యం సేవించటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లు ప్రభుత్వం తీరుతో వృథాగా పడి ఉన్నాయని పలురాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

లబ్ధిదారుల సంఖ్య వేల‌ల్లో ఉండ‌టం... నిర్మించిన ఇళ్ల సంఖ్య తగినన్ని లేకపోవటమే ఈ ఇళ్ల కేటాయింపుల్లో జాప్యానికి కారణంగా తెలుస్తోంది. కొంత మందికి ఇస్తే.. మిగ‌తా వారి నుంచి సమస్యలు తలెత్తుతాయని అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. మ‌రోవైపు లబ్ధిదారుల నుంచి పలువురు మధ్యవర్తులు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆడియోలు సైతం బయటికి రావటం కూడా... ఈ ఇళ్ల కేటాయింపుల్లో జాప్యానికి కారణంగా భావిస్తున్నారు. కానీ... ఇళ్ల కేటాయింపుల్లో జాప్యంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే ఇళ్ల కేటాయింపు జరిగిన పదీ ఇరవై కుటుంబాలు సైతం... ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెద్దగా జనసంచారం లేకపోవటం... విద్యుత్‌, తాగునీరు, రవాణా సౌకర్యాలు లేక అవస్థలకు గురవుతున్నట్లు వాపోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి... ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వెంటనే కేటాయింపుల ప్రక్రియ పూర్తిచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇంకొంత కాలం ఇదే ధోరణి ప్రదర్శిస్తే పూర్తిగా శిథిలావస్థకు చేరి... నివాసానికి యోగ్యంగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.