ETV Bharat / city

వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయాడంటూ ఆందోళన - వైద్యుల నిర్వాకంతో శిశువు మరణించారంటూ ఆందోళన

Baby died in karimnagar: పండంటి బిడ్డకు జన్మనిచ్చాననే సంతోషం ఆ తల్లికి ఎంతో కాలం నిల్వలేదు. వైద్యుల నిర్లక్ష్యంతో పండంటి మగ బిడ్డకు వారం రోజుల్లోనే ఆయుష్షు తీరింది. ముద్దులొలికే చిన్నారిని విగత జీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాంతో ఆ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Baby died
Baby died
author img

By

Published : Apr 3, 2022, 12:29 PM IST

Baby died in karimnagar: ప్రాణాలు పోస్తారనుకున్న వైద్యులే నిండుప్రాణాలు తీస్తుండడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కరీనగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజుల శిశువు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు చనిపోయాడంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. డబ్బులు కట్టలేదని.. చికిత్స అందించలేదంటూ ఆరోపిస్తూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన లావణ్య నగరంలోని లైఫ్​లైన్ ఆసుపత్రిలో గత నెల 26 వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎనిమిది నెలల్లోనే శిశువు పుట్టడంతో బరువు తక్కువగా ఉన్నాడని ఇంక్యూబేటర్‌లో ఉంచాలని చెప్పడంతో... ఓ ప్రైవేట్ చిన్నపిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. అప్పు చేసి ఎనిమిది రోజులకు లక్షా 45 వేల రూపాయలు కట్టారు. మరో లక్ష కడితేనే చిన్నారికి ఆక్సిజన్‌ అందిస్తామని వైద్యులు చెప్పారని... రెండ్రోజుల్లో కడతామని చెప్పినా చికిత్స అందించలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆక్సిజన్ ఇవ్వకపోవడంతోనే చనిపోయాడని ఆ తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట గుండెలవిసేలా విలపిస్తూ ఆందోళనకు దిగారు.

'గత రెండు రోజుల క్రితం మరో లక్ష రూపాయల తీసుకువస్తేనే బాబుకు ఆక్సిజన్ ట్రీట్​మెంట్ అందిస్తామని వైద్యులు చెప్పారు. వరుసగా బ్యాంకులకు సెలవులు ఉండటంతో సోమవారం రోజు డబ్బులు తీసుకు వస్తామని చెప్పాము. చికిత్స అందించాలని వైద్యుల్ని బ్రతిమిలాడాము. ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఆక్సిజన్ ఇవ్వకపోవడంతోనే మా బిడ్డ మృతి చెందాడు.'

- శిశువు తల్లిదండ్రులు

ఇదీ చదవండి: పల్లీ యంత్రం.. ఆ బాలుడి భవిష్యత్తును చిదిమేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.