ETV Bharat / city

అవశేషాలతో కలుషితమైన మిడ్​మానేరు నీరు.. తాగితే అంతే!

మధ్యమానేరు ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో తాగునీటికి సరికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఆనకట్ట పరిధిలో గతంలో ఉన్న గ్రామాలు, చెట్ల అవశేషాలతో నీరు పూర్తిగా కలుషితమవుతోంది. రంగు, గాఢత అధికంగా ఉండటంతో శుద్ధిచేయడమూ....అధికారులకు కష్టమవుతోంది. ప్రజలు కాచి, వడబోసుకుని నీరు తాగడం మంచిదని సూచిస్తున్నారు.

MID MANAIR
అవశేషాలతో కలుషితమైన మిడ్​మానేరు నీరు.. తాగితే అంతే!
author img

By

Published : Apr 10, 2021, 5:17 AM IST

అవశేషాలతో కలుషితమైన మిడ్​మానేరు నీరు.. తాగితే అంతే!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మధ్యమానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ తాగు,సాగు నీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. సిరిసిల్ల, వేములవాడ,చొప్పదండి నియోజకవర్గాలతో పాటు కరీంనగర్‌కు తాగునీరు అందించే దిగువమానేరుకు... మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీరందిస్తారు. మొన్నటి వరకు 25టీఎంసీలతో జలాశయం కళకళలాడగా.. కేవలం నెలరోజుల్లోనే 15టీఎంసీలకు తగ్గిపోయింది.

ప్రత్యమ్నాయాలు చూసుకోవాలని సూచన..

యాసంగి పంటకోసం వరంగల్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాలకు 11టీఎంసీల నీటిని నిరంతరాయంగా తరలించారు. ఒక్కసారిగా నీరు తగ్గిపోవడం ప్రస్తుతం సమస్యగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ముంపునకు గురైన 11 గ్రామాలకు సంబంధించిన పాత ఇళ్లు, వాటి అవశేషాలు, చెత్తచెదారం, మునిగిపోయిన చెట్లలో రసాయన చర్యలు వెరసి..... నీరు కలుషితంగా మారింది. అధికారులు గతనెల 30 నుంచి తాగునీటి సరఫరాను నిలిపివేసి ప్రత్యమ్నాయాలు చూసుకోవాలన్నారు. ప్రస్తుతం పాతపద్ధతుల ద్వారా నీరు అందిస్తుండగా.....జలాశయంలోని నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

అవశేషాలు, నాచుతో రంగు మారిన నీరు..

భగీరథ శుద్ధి కేంద్రం రుద్రవరంలోని ఇంటేక్‌వెల్‌ పూర్తిగా మట్టి అవశేషాలతో నిండిపోయింది. కరీంనగర్‌లోని శుద్ధికేంద్రంలోనూ..... మట్టితో పాటు నాచు వచ్చి చేరుతుండటంతో నీటి రంగు పచ్చగా మారిపోతోంది. దీనివల్ల శుద్ధిచేసిన నీరూ వాసన వస్తోంది. ప్రజలు నీళ్లు కాచి వడబోసుకుని తాగాలని అధికారులు సూచిస్తున్నారు.

పూర్తిస్థాయిలో కిందికి వదిలితే

జలాశయంలోని నీటిని పలుమార్లు పూర్తిస్థాయిలో కిందికి వదిలితే అందులోని పురాతన గృహాలు, చెట్లు, నీటిలో కుళ్లిన అవశేషాల స్థాయి తగ్గుతుంది. వరుసగా కొన్నేళ్లపాటు ఇలా చేయడం వల్ల జలాశయం పూర్తిగా శుభ్రమౌతుందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి; సాగర్‌ ఉపఎన్నికలో కోవర్టులపైనే పార్టీల ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.