కరీంనగర్లో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. 35వ డివిజన్ శ్రీనగర్, సప్తగిరి కాలనీలో స్థానికులు సమస్యలు వివరించగా వెంటనే పరిష్కరించారు. రెండు వీధుల్లో రోడ్డు నిర్మించేందుకు టెండర్లు పిలిచి జనవరి నెలాఖరులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
35, 14 డివిజన్ల మధ్య రైతు బజార్ ఏర్పాటు చేస్తాం. కాలనీలో రోడ్ల నిర్మాణానికి 14 లక్షలతో జనవరిలోగా పనులు పూర్తి చేస్తాం. చీకటి ప్రాంతాల్లోని 20 చోట్ల ఎల్ఈడీ వీధి దీపాలు కొత్తవి పెట్టిస్తాం.
-సునీల్ రావు, కరీంనగర్ మేయర్
280 కుటుంబాలకు 560 తడి, పొడి చెత్త డబ్బాలు మేయర్ పంపిణీ చేశారు. 15 రోజుల్లో.. 4 లక్షలతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. పట్టణ ప్రగతి నిధులతో పాఠశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని తెలిపారు. 'ఈనాడు, ఈటీవీ' మీతోడు కార్యక్రమంలో భాగంగా అధికారులతో పర్యటించారు.
ఇదీ చూడండి: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది.. కేసీఆర్: మంత్రి జగదీశ్