కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో జిల్లా కలెక్టర్ శశాంక పర్యటించారు. ముందుగా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు వంటి అంశాలను ప్రశ్నించారు. ఆసుపత్రిలో అందించే సేవలను స్వయంగా పరిశీలించారు.
అనంతరం మండలంలోని శాలపల్లి, ఇందిరానగర్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. పొలం గట్ల పక్కన మొక్కలను నాటారు. ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.