ETV Bharat / city

ఉమ్మడి జిల్లాపై నెలకు రూ.1.63కోట్ల భారం

కరోనా కష్టకాలంలో మరో అదనపు భారం జిల్లా ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వంటకు వినియోగించే రాయితీ గ్యాస్‌ సిలిండర్ల ధరను రూ.50 పెంచడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రతి నెల పెద్దమొత్తంలో చెల్లించాల్సిన తీరు సామాన్యులకు కష్టంగానే మారనుంది. చమురు సంస్థలు మరోమారు గ్యాస్‌ ధరను పెంచి జిల్లావాసి నడ్డివిరిచాయి. తాజాగా పెరిగిన అదనపు భారం గుదిబండగానే మారబోతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 70శాతానికిపైగా కుటుంబాల్లో సర్కారు అందించే రాయితీ సిలిండర్లనే వాడుతున్నారు. ఇప్పటికే అన్ని రకాలుగా పెరిగిన కూరగాయలు, నిత్యావసర వస్తువులకు తోడుగా వంటింటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.

author img

By

Published : Dec 3, 2020, 11:55 AM IST

ఉమ్మడి జిల్లాపై నెలకు రూ.1.63కోట్ల భారం
ఉమ్మడి జిల్లాపై నెలకు రూ.1.63కోట్ల భారం

కీలకమైన గ్యాస్‌ వినియోగంలో కొన్ని నెలలుగా కష్టాలు తప్పడంలేదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ వీటి ధరల విషయంలో హెచ్చుభారమనే తీరును వినియోగదారులు ఆయా సందర్భాల్లో ఎదుర్కొన్నారు. ప్రస్తుతం 14.2 కిలోలున్న రాయతీ సిలిండర్‌ ధర రూ.666.50పైసలకు అందుతోంది. ఇందులో రూ.47.38పైసలు రాయితీ రూపంలో వినియోగదారు ఖాతాలో జమవుతోంది. కాగా ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంచడం.. ఇది తక్షణమే అమల్లోకి రావడంతో ప్రస్తుతం వినియోగదారుడి నెత్తిన ఊహించని భారం పడినట్లైంది. పెరిగిన ధర ఆధారంగా ఇప్పుడు ప్రతి నెల ఇంట్లో వంటకు వినియోగించే సిలిండర్‌కు రూ.716.50 చెల్లించాల్సి వస్తోంది. నెలలో ప్రతిఇంట్లో సగటున ఒక సిలిండర్‌ను వాడుతున్నారు. ఈ లెక్కన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 3.26లక్షల మంది వినియోగదారులకు సంబంధించి నెలకు రూ.1.63కోట్లు అదనపు భారం పడబోతోంది. ఇదే తీరు ఏడాదికి లెక్కేస్తే సుమారుగా రూ.19.56కోట్ల బరువు వినియోగదారుల నెత్తిన పడబోతోంది.

నెలనెలకు అ‘ధనమే’..!

వాస్తవానికి అసలు సిలిండర్‌ ధరకు మించి కొన్నాళ్లుగా వినియోగదారులు అదనపు ఛార్జీలను రవాణా రూపంలో వసూలు చేస్తున్నారు. వీటివల్లనే ఇప్పటికే ఆర్థికంగా నష్టమనే భావనలో ఉండగా అసలు ధరపై పెంపు కొత్త భారంగానే మారుతోంది. ఇన్నాళ్లుగా అసలు సిలిండర్‌ ధర ఎంత ఉన్నా దానికన్నా ఎక్కువగా 20 నుంచి రూ.30 కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల వారు వసూలు చేస్తున్నాయి. ఇంటికి చేరవేసే ప్రతి సిలిండర్‌పై ఈ భారాన్ని మోపుతుండటంతో ఊహించని దోపిడీకి వినియోగదారులు గురవుతున్నారు. నిర్ణీతంగా కొన్ని కి.మీ దూరం వరకు సిలిండర్‌ను ఉచితంగా అందించాలనే నిబంధనను ఆయా ఏజెన్సీలు విస్మరిస్తున్నాయి. ఇక దూర ప్రాంతాలైన ఆయా గ్రామాలకు చేరేవేసే ఒక్కో సిలిండర్‌పై రూ.40 నుంచి రూ.50వరకు దండుకుంటున్నారు. దీంతో ఇప్పుడు పెరిగినకొత్త ధరకు అదనంగా పాత దోపిడీ తీరు కనిపించే వీలుంది. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న వాటి విషయంలోనే సంబంధిత పర్యవేక్షణ అధికారులు దృష్టి సారించాలనే వాదనను వినియోగదారులు వినిపిస్తున్నారు. ఈ తీరులో ఇకనైనా మార్పురావాలని పలువురు కోరుతున్నారు.

ఇవీ చూడండి: పుంజుకున్న ‘ధరణి’ సేవలు.. నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.