ETV Bharat / city

YS Viveka murder case: పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డి హాజరు.. 14 రోజుల రిమాండ్​ - cbi-officers-inquiry-in-viveka-murder-case

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య(Viveka murder case) కేసులో ప్రధాన అనుమానితుడు దేవిరెడ్డి శివ శంకర్​ రెడ్డికి కడప జిల్లా పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. హైదరాబాద్​లో నిన్న శివశంకర్​రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేడు పులివెందుల కోర్టులో ఆయనను హాజరుపరిచారు.

Viveka murder case
వివేకా హత్య కేసు
author img

By

Published : Nov 18, 2021, 4:17 PM IST

Updated : Nov 18, 2021, 7:58 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య(YS Viveka murder case) కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత శివశంకర్​రెడ్డిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతించడంతో ట్రాన్సిట్‌ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని ఈ ఉదయం కడపకు తీసుకువచ్చారు. కడప రిమ్స్​లో శివశంకర్​రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పులివెందుల కోర్టులో శివశంకర్​రెడ్డిని సీబీఐ అధికారులు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్​ (డిసెంబర్​ 2వ తేదీ వరకు) విధించారు.

కోర్టు వద్దకు ఎంపీ అవినాష్​..

శివశంకర్‌రెడ్డిని కలిసేందుకు పులివెందుల కోర్టు వద్దకు ఎంపీ అవినాష్(YS Viveka murder case) రెడ్డి వచ్చారు. కోర్టు వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

మా నాన్నకు సంబంధం లేదు..

మరోవైపు న్యాయం చేయాలని కోరుతూ సీబీఐకి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి లేఖ రాశారు. ‘‘వివేకా హత్య కేసులో మా తండ్రికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆరోపణలతోనే మా నాన్నను అరెస్టు చేశారు. ఈ నెల 15న ఆయన ఎడమ భుజానికి సర్జరీ జరిగింది. ఇంకా వైద్యచికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంతో ఉన్నందున న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి’’ అని చైతన్యరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

సీబీఐ డైరెక్టర్​కు శివశంకర్ రెడ్డి లేఖ...

వివేకా(Viveka murder case) హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాశారు. నిన్న హైదరాబాద్​లో శివశంకర్ రెడ్డి(shiva shankar reddy)ని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు... ఇవాళ ఉదయం కడపకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం తర్వాత దేవిరెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అయితే వివేకా కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని... కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించే కుట్ర పన్నారని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో సిట్, సీబీఐ అధికారులు పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరై సహకరించినట్లు తెలిపారు.

దర్యాప్తు సమయంలో వివేకా కుమార్తె సునీత.. పలుమార్లు అధికారులతో సమావేశమవుతూ దురుద్దేశాలను ఆపాదిస్తూ పిటిషన్లు ఇస్తున్నారని శివశంకర్​రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని, లేకుంటే అసలు నిందితులు తప్పించుకుని అమాయకులు దోషులుగా తేలే ప్రమాదం ఉందని విజ్ఞప్తి చేశారు. వివేకా ఫోన్ లోని డేటాను టాంపర్ చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలకు ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. హత్యకేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగిరికి ఐదు రోజుల్లోనే ముందస్తు బెయిలు ఎలా మంజూరైందని ప్రశ్నించారు. శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి కూడా తన తండ్రికి కేసుతో సంబంధం లేదని పేర్కొన్నారు.

వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన...

వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka murder case)లో సీబీఐ మరొకరిని అరెస్టు చేసింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(Shiva Shankar Reddy) ని బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. ఆయన కడప ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి(Kadapa MP Avinash Reddy)కి సన్నిహితుడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి(Dhastagiri) ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఉంది. వివేకాను హత్య(Viveka murder case)చేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ ఇటీవల సమాచారమిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తర్వాత వస్తానంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్‌లో ఆయన్ను పట్టుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం ఆయన్ను కడప తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టింది. గురువారం ఆయన్ను పులివెందులకు తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరు పరచనుంది. అయితే సీబీఐ వర్గాలు అధికారికంగా వివరాలేమీ ప్రకటించలేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇదీచదవండి: TRS Dharna: ధాన్యం కొనుగోళ్లపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన తెరాస నేతలు

Last Updated : Nov 18, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.