కరీంనగర్లో దీక్ష చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు వైద్యులను పంపి పరీక్షించాలన్న జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదన్నారు.
ఆరోగ్యం క్షీణించాలనే ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వమే హత్య చేసేందుకు యత్నిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. షుగర్ లెవల్స్ 70కి పడిపోతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది... కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఇదీ చూడండి: కొనసాగుతున్న బండి సంజయ్ దీక్ష.. పార్టీ శ్రేణుల ఆందోళన