సీఎం కేసీఆర్పై రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా.. ఖమ్మం జిల్లా మధిర అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్షకు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
తక్షణమే నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతులకు అన్యాయం చేయడం తగదని హితవుపలికారు. అన్నదాతను అవస్థలకు గురిచేస్తే తగిన గుణపాఠం తప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో శీలం నరసింహారావు, బెజవాడ రవిబాబు, పాపినేని రామనర్సయ్య, సైదులు, కర్ణాటి రామారావు పాల్గొన్నారు
ఇవీచూడండి: భారీ వర్షాలనూ లెక్కచేయని అన్నదాతలు